Shocking Incident: రేబిస్ సోకిన గేదె పాలతో చేసిన రైతా.. తిన్న 200 మంది..
- యూపీలోని పిప్రౌలి గ్రామంలో గెదేకు రేబిస్
- గేదే పాలతో చేసిన రైతా.. తిన్న స్థానికులు
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని పిప్రౌలి గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో నిర్వహించిన ఒక అంత్యక్రియల అనంతరం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో వడ్డించిన రైతాను సుమారు 200 మంది గ్రామస్తులు తిన్నారు. అయితే ఆ రైతా రేబిస్ సోకిన గేదె పాలతో తయారైనదని విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే, పిప్రౌలి గ్రామానికి చెందిన ఓ రైతు పెంచుతున్న గేదె నుంచి సేకరించిన పాలతో పెరుగు తయారు చేసి రైతా సిద్ధం చేశారు. ఆ రైతాను అంత్యక్రియల సందర్భంగా గ్రామస్తులకు వడ్డించారు. అయితే కొద్ది రోజులకే ఆ గేదె రేబిస్ సోకి మృతి చెందడంతో అసలు విషయం బయటపడింది. ఈ సమాచారం అధికారులకు చేరడంతో వెంటనే అప్రమత్తమైన వైద్య శాఖ చర్యలు చేపట్టింది.
Also Read
- India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
- Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ఆ భోజన కార్యక్రమంలో రైతా తిన్న వారందరినీ గుర్తించిన వైద్య అధికారులు సుమారు 200 మందికి యాంటీ-రేబిస్ వ్యాక్సిన్‌ను అందించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వైద్య శాఖతో పాటు పశువైద్య శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, రేబిస్ సోకిన గేదెను పెంచిన రైతుపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
-
India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్తో వస్తోంది!
-
Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..