5G Smartphones under 8K in India With Qualcomm New Chip: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ రంగంలో 5జీ నెట్‌వర్క్ హవా నడుస్తోంది. అందుకే మొబైల్ ప్రియులు 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.10-15 వేలు తప్పనిసరి. మంచి ఫీచర్లు కోరుకునే వారు ఖచ్చితంగా రూ.20 వేలు పెట్టాల్సిందే. ఇంత మొత్తం వెచ్చించలేని వారు చాలానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ‘క్వాల్‌కామ్’ శుభవార్తను అందించింది.…