గూఢచర్యం ఆరోపణలకు సంబంధించి అక్టోబర్ నెలలో ఎనిమిది మంది భారత నేవీ మాజీ సిబ్బందికి ఖతార్ కోర్టు విధించిన మరణ శిక్షలను తగ్గించిందని భారత ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దహ్రా గ్లోబల్ కేసులో ఖతార్ అప్పీల్ కోర్టు శిక్షలను తగ్గించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.