వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ప్రముఖ మలయాళ, తమిళ నటి అపర్ణాదాస్ పంజా వైష్ణవ్ తేజ్ తాజా చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పోషించబోతున్న వజ్ర కాళేశ్వరి దేవి పాత్ర మూవీకి హైలైట్ గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
'ఉప్పెన' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకోనున్న చిత్రం బుధవారం ముహూర్తం జరుపుకుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభం అయింది. సుప్రసిద్ధ దర్శకు డు త్రివిక్రమ్, హీరో సాయి ధర్మ తేజ్, హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), దర్శకుడు సుధీర్ వర్మ, మరో దర్శకుడు కళ్యాణ్ (‘అనగనగా ఒక రాజు’) చిత్ర యూనిట్…