PVT04: అప్పుడు కోలీవుడ్ హీరో.. ఇప్పుడు మాలీవుడ్ హీరో.. బావుందయ్యా వైష్ణవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PVT04: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో కుర్ర హీరోకు తీరుగులేదు అనుకున్నారు. కానీ, మొదటి సినిమా తరువాత రిలీజ్ అయిన కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లాపడ్డాయి. దీంతో వైష్ణవ్.. తన తరువాతి సినిమాలను ఆచితూచి ఎంచుకొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొత్త దర్శకుడితో ఒక కొత్త సినిమాను ప్లాన్ చేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో వైష్ణవ్ PVT04 అనే సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ- సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన వైష్ణవ్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన లక్కీ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది.
NTR: అందరి కంటే ముందే వచ్చేసిన ఎన్టీఆర్.. కారణం అదేనా..?
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న నటుడును పరిచయం చేశారు. మలయాళంలో మంచి నటుడిగా మెప్పిస్తున్న జోజు జార్జ్ ను రంగంలోకి దించారు. ఈ మధ్యనే ఇరట్ట సినిమాతో హిట్ కొట్టిన జోజు పేరు మలయాళంలో మారుమ్రోగిపోతుంది. ఈ సినిమాలో హీరోకు పోటీగా ఉండే పాత్ర కావడంతో ఆయన విలన్ గా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. చెంగా రెడ్డి అనే పాత్రలో జోజు కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ” PVT04 లో జోజు జార్జ్ ను క్రూరమైన, అతి భయంకరమైన సమస్యలను సృష్టించే చెంగారెడ్డిగా పరిచయం చేస్తున్నాం. ఇరట్ట విజయం సాధించినందుకు అభినందనలు, జోజు సార్! పెద్ద స్క్రీన్‌పై మీ క్రూరత్వాన్ని మరింతగా చూసేందుకు వేచి ఉండలేను” అంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే వైష్ణవ్ మొదటి సినిమా ఉప్పెన కోసం కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని విలన్ గా దింపారు.. అది సూపర్ హిట్. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం మాలీవుడ్ హీరోను రంగంలోకి దించుతున్నారు.. మరి ఈ సినిమాతో మెగా మేనల్లుడు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
Introducing #JojuGeorge as ferocious, ruthless, troublesome "Chenga Reddy" in #PVT04 🔥
Congrats on the success of #Iratta, Joju sir! 👏 Can't wait to witness more of your ferocity on the big screen 🤩 #PanjaVaisshnavTej @sreeleela14 #SrikanthNReddy pic.twitter.com/PpRNCBwy1C
— Naga Vamsi (@vamsi84) March 15, 2023
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!