మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల అభినందిస్తూ తెలంగాణ శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానికి కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఈరోజు తెలంగాణ గుండె ఉప్పొంగింది అని అన్నారు.
తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత దేశాన్ని గాడిన పెట్టీ తన వంతు సేవ దేశానికి అందించారు.. పీవీ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి.. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
నేడు పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళులు ఆర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణ భారతం నుంచి ప్రధాన మంత్రి అయిన ఏకైక వ్యక్తి పీవీనే అని ఆయన పేర్కొన్నారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ మన పీవీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ భారత ప్రధాని పీవీ నరసింహరావు 102 వ జయంతి సందర్భంగా సీఎం కేసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు.