CM Revanth Reddy: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.. సత్యసాయి జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. బాబా మనుషుల్లో దేవుని చూశారు.. ప్రేమతో మనుషుల్ని గెలిచారన్నారు. ప్రేమ గొప్పది ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించారన్నారు. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా ట్రస్ట్ ప్రజలకు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని భక్తులు అలంకరించారు. ఈ వేడుకలకు హిల్ వ్యూ స్టేడియం ముస్తాబైంది. దీంతో పాటు పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
CM Chandrababu: శ్రీ సత్యసాయి బాబా సేవా స్పూర్తి ప్రపంచానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి నారా లోకేష్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస.. ఇవే సత్యసాయి జీవన సూత్రాలని, ఇవి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే విలువలని సీఎం గుర్తుచేశారు. సత్యసాయి సేవలు అపారమైనవి అని పేర్కొన్నారు. Read…
President Draupadi Murmu: సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయి.. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు.. సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న ఆమె.. సత్యసాయి బోధనలు కోట్లాది మందిని ప్రభావితం చేశాయి.. ఇక,…