అలాస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం జరిగింది. వీరిద్దరి భేటీతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏదొక పరిష్కారం దొరుకుతుందని ప్రపంచమంతా ఎదురుచూస్తే.. చివరికి ఏమీ లేకుండానే 3 గంటల సమావేశం ముగియడం ఆశ్చర్యానికి గురి చేసింది.
అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ జరిగింది. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపింది. ఇద్దరి భేటీతో మేలు జరుగుతుందని భావించారు. చివరికి ఎలాంటి పురోగతి లేకుండా సమావేశం ముగియడం నిరాశ పరిచింది.
అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీపై ఎన్నో అంచనాలు.. ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. ఇద్దరి సమావేశం తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఒక ముగింపు పలుకుతుందని ప్రపంచమంతా ఎదురుచూసింది. కానీ చివరికి ఇద్దరి భేటీ ‘తుస్’ మనిపోయింది.
ఉక్రెయిన్ తన భూభాగాన్ని రష్యాకు వదులుకోవాల్సిన అవసరం లేని విధంగా ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించినట్లయితే, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానని అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ‘రేజింగ్ మోడరేట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్లరీ ఈ ప్రకటన చేశారు. నిజాయితీగా చెప్పాలంటే, ఉక్రెయిన్ తన భూమిని దురాక్రమణదారు దేశానికి (రష్యా ) వదిలివేయాల్సిన అవసరం లేని విధంగా, ఇప్పటివరకు మనం చూడని విధంగా…
ఆగస్టు 15న ట్రంప్-పుతిన్ సమావేశం అవుతున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. చర్చలు ఫలించలేదు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కృషి చేస్తున్నారు. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు.
USA: రష్యాతో స్నేహంపై భారత్, చైనాలను భయపెడుతూ ఇటీవల అమెరికాలో కీలక స్థానాల్లో ఉన్న వారు హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవల నాటో చీఫ్ మాట్లాడుతూ.. రష్యాతో చెలిమి భారత్‌ని దెబ్బతిస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనెలటర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు ఆపకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు చైనాతో సహా అధిక సుంకాలను విధిస్తాడని సెనేటర్ లిండ్సే…
ఉక్రెయిన్‌పై 50 రోజుల్లోగా రష్యా యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరిగారు. పుతిన్ ఉద్దేశమేంటో అర్థమవుతోందని.. పగలు చాలా అందంగా మాట్లాడతాడని. రాత్రయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతాడని... అలాంటి ప్రవర్తన తనకు నచ్చట్లేదని ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.