Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటకు వచ్చారు. భారత్, రష్యాల మధ్య మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలపై చర్చలు జరుగుతాయి. ఇదిలా ఉంటే, ఇండియా టుడే పుతిన్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వైఖరి, వెస్ట్రన్ దేశాల నైజాన్ని ఎండగట్టారు.
Putin Flight: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు(డిసెంబర్ 4)న భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ పట్టించుకోకుండా, నేరుగా పాలం ఎయిర్ బేస్‌కు వెళ్లి పుతిన్‌ను ఘనంగా స్వాగతించారు. అక్కడ నుంచి ఇద్దరూ కూడా ప్రధాని నివాసానికి వెళ్లారు.
India-Russia Deal: ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. దీంతో మాస్కో నుంచి ఆయిల్ ను ఇండియా అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంది.
Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది గంటల్లో భారత్ భూమిపై దిగబోతున్నారు. ఆయన ఓ ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నారు. పుతిన్ ప్రయాణిస్తున్న స్పెషల్ విమానం IL-96-3000 PUE ను ‘ఆకాశంలో ఎగిరే కోట’ అని అంటారు. ఈ విమానం మీద మిసైల్స్ సైతం ప్రభావం చూపలేవు. పుతిన్ భద్రత అత్యంత హైటెక్ గా ఉంటుంది. పుతిన్ తల నుంచి పాదాల వరకు ప్రత్యేక దుస్తులు, భద్రత పరికరాలు ధరిస్తారు.
Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక విమానం కొన్ని గంటల్లో భారతదేశంలో ల్యాండ్ అవుతుంది. భారతదేశం-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఆయన 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారత గడ్డపై దిగిన తర్వాత.. పుతిన్ ప్రత్యేక భద్రతా కవచంలో ఉంటారు. భారీ భద్రత మధ్య పుతిన్ రెండు రోజుల పర్యటన కొనసాగనుంది.
Putin- Modi Meeting: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు.