Belarus President gifts Putin a tractor for 70th birthday: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో రష్యాలో పుతిన్ బర్త్ డే వేడుకలను పెద్దగా జరుపుకోలేదు. అయితే తన బర్త్ డే సందర్భంగా ఒకరు మాత్రం వినూత్నంగా గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా ఓ ట్రాక్టర్ నే గిఫ్టుగా బహూకరించారు. ఆయన ఎవరో కాదు బెలారస్ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో. పుతిన్ కు అత్యంత సన్నిహితుడు.