Illegal Smuggling: తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి ప్రాంతంలో అక్రమ కలప స్మగ్లింగ్‌ను అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డుకుంది. దేవరపల్లి, కన్నాపురం ప్రాంతాల నుంచి సుమారు వంద సంవత్సరాల వయస్సు గల అరుదైన రావి చెట్లను వేళ్లతో సహా నరికి, వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయాలు జరుపుతున్న ముఠాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టుకున్నారు.