ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్‌లో భయం లేని హీరో అంటే అల్లు అర్జున్ అంటూ ఆర్జీవీ పేర్కొన్నాడు. రీసెంట్‌గా విడుదలైన ‘పుష్ప’ ట్రైలర్‌ను చూసి ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పుష్ప లాంటి పాత్రలు బన్నీ కాకుండా మరెవరూ చేయలేరన్నాడు. రియలిస్టిక్ పాత్రలు చేయాలంటే అల్లు అర్జున్ మాత్రమే పర్‌ఫెక్ట్ అని ఆర్జీవీ కొనియాడాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, మహేష్…
“అహ… అహ… అహ…” అంటూ వచ్చేశారు అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్! ‘ఆహా’ అనిపించేలా ఫస్ట్ సింగిల్ వాయించేశారు! మరీ ముఖ్యంగా, ‘సమ్రాట్ ఆఫ్ మ్యూజిక్’ అంటూ టైటిల్ కార్డ్ వేయించుకున్న డీఎస్పీ దానికి తగ్గట్టే బీట్ తో బీట్ చేసేశాడు. డ్రమ్స్ మోతతో ‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ మార్మోగిపోయింది! దట్టమైన అడవిలా పెరగిపోయిన గడ్డంతో, కీకారణ్యం లాంటి జుట్టుతో బన్నీ మాస్ లుక్ తో అదరగొట్టేసింది! ‘ఐకాన్ స్టార్’గా తరలి వస్తోన్న మన…