భారత్‌లో తెలుగు, మలయాళం, తమిళ సినిమాలు తాను చూస్తుంటా అని శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ తెలిపాడు. పుష్ప సినిమా బాగుందని, అప్పటి నుంచి తాను ఎక్కువగా తెలుగు చిత్రాలు వీక్షిస్తున్నానని చెప్పాడు. మైదానంలో పుష్ప తరహాలో సంబరాలు చేసుకోవడం బాగుందని హసరంగ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ శివమ్ దూబెను ఔట్ చేసిన…