ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరో పుష్పరాజ్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను ఏప్రిల్ 7న విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్…