డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సరికొత్త టాపిక్ తీసుకొచ్చారు. ‘స్ట్రాంగ్ పీపుల్’ అనే దానిపై చక్కటి విశ్లేషణ చేశారు. నార్మల్ పీపుల్‌కీ స్ట్రాంగ్ పీపుల్‌కి మధ్య చాలా తేడా ఉంటుందని.. ఆ తేడాను వివరించారు.