టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఓ సినిమా చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్స్ తర్వాత పూరితో సినిమాలు చేయడాని టాలీవుడ్ హీరోలెవరు సాహసం చేయలేదు. దీంతో పూరి ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో పూరి సినిమా మొదలు పెట్టాడు.…