విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో కాసేపట్లో బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన ఈ కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో 26 జిల్లాల ఇంఛార్జ్‌లు పాల్గొననున్నారు. ఎలక్షన్లలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనే అంశంపై సమావేశంలో నిర్ణయించనున్నారు.
వర్షాలు ఆగి రెండు రోజులైనా పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి.. కాలువలు ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు అని ఆరోపించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది.. రైతులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు.. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు.. నష్టపోయిన ప్రతి రైతుకి ఏకరనికి 50 వేల రూపాయలు రా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ తో పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కోరారు. రైతులకు ఉదారంగా ఆర్ధిక సహకారం అందించాలి అని ఆమె తెలిపారు.
ప్రస్తుతం తెలుగు అంతరించిపోయే దశలో ఉందనే ఆందోళన కలుగుతోంది అని పురంధేశ్వరి అన్నారు. భాష మృతభాషగా మారడం మన సంస్కృతి అంతరించడమే.. మన సంస్కృతి, సాంప్రదాయం తెలుగు సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు.