పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరెన్ రిజిజు సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు.
త్వరలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. ఇక, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆ తర్వాత పంజాబ్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. కానీ, అంతర్గత కుమ్మలాటలతో బయటకు వెళ్లిపోయి.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.. ఇక, పీఎల్‌సీ అధ్యక్షుడు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్…
గత కొన్ని రోజులుగా పంజాబ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రానున్న ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో పంజాబ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పాటియా లా నుంచి పోటీ చేస్తానని తెలిపారు. నేను పాటియాలా నుంచి పోటీ చేస్తాను.. పాటియాలా 400 ఏళ్లుగా మాతోనే ఉందని, సిద్ధూ వల్ల నేను దానిని వదిలిపెట్టబోనని…
పంజాబ్‌లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీని నడిపించబోతున్నట్టు కెప్టెన్ తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు, 7 పేజీలతో కూడిన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు పంపారు. మరి కొన్ని నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్తపార్టీని ఏర్పాటు చేసిన అమరీందర్ సింగ్…