Punjab: పంజాబ్ రాష్ట్రం పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులతో దద్దరిల్లిపోతోంది. ఆదివారం రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుంది. ఈ రోజు తెల్లవారుజామున మోగా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లక్కీ పాటియాల్ గ్యాంగ్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుపై వచ్చిన గ్యాంగ్‌స్టర్లని పోలీసులు గమనించి, ఆపాలని కోరినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బైక్‌ని వదిలి పొలాల్లోకి పరిగెత్తారని, పోలీసులపై కాల్పులు జరిపారని మోగా డీఎస్పీ హరీందర్ సింగ్ తెలిపారు.
Siddu Musewala murder case: పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులకు, పోలీసులు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం అమృత్‌సర్ జిల్లాలోని పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు అట్టారీ బార్డర్ కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోషియార్ నగర్ గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో సిద్దూ మూసేవాలా హత్యతో ప్రమేయం ఉందని భావిస్తున్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ జగ్రూప్ సింగ్ రూపం, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్నూ కుస్సాను…