సైకిల్ తొక్కడం కొందరికి చిన్నప్పటి సరదా. కాస్త పెద్దయ్యాక ఆ సైకిల్ ని మరిచిపోతుంటారు. మరికొందరికి కుక్కపిల్లల్ని, వివిధ పెంపుడు జంతువుల్ని ఇంట్లో పెంచుకుంటారు. జిహ్వ కో రుచి. మనిషి మనిషికో హాబీ. నాణేలు, కరెన్సీ నోట్లు, తపాలా బిల్లలు, శతాబ్దం నాటి పుస్తకాలు వంటి ప్రాచీన వస్తువులను చాలా మంది సేకరిస్తారు. మరికొందరు బుక్స్ అవీ సేకరిస్తారు. వీరందరికంటే భిన్నమయిన వ్యక్తి ఒకరున్నారు. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ పెండ్సే విభిన్నమయిన వ్యక్తి. ఆయనకు వింటేజ్ సైకిళ్ళు…
కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్న వేళ ప్రజారవాణా, ప్రైవేట్ రవాణా వ్యవస్థలు ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గుతున్నాయి. పూణే రహదారులపై మరో 100 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లమీదకు రావడానికి రెడీ అయ్యాయి. ఎలక్ట్రిక్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ్టి పర్యటనలో మోడీ పాల్గొంటున్నారు. పూణేలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి 150 ఓలెక్ట్రా బస్సులు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న…
గత నాలుగు నెలల్లో దేశం తొమ్మిది మెగా నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లలో 2.5 రెట్లు వృద్ధిని సాధించడంతో, పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేసే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు భారతదేశం చేసిన ప్రయత్నం ఉత్తమ ఫలితాన్ని ఇచ్చింది. ఇది సూరత్, పూణె, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నైలలో అక్టోబర్ 2021 నుండి జనవరి 2022 మధ్య 678 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. “ప్రభుత్వం ప్రైవేట్ మరియు పబ్లిక్…
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అనే సాంగ్ గుర్తుంది కదా…అలానే పాపం ఓ చిరుత పులి బద్లాపూర్ జిల్లా గోరెగాన్ ప్రాంతంలోకి వచ్చింది. అడవిలోనుంచి వచ్చిన సంవత్సరం వయసున్న చిరుతపులి వాటర్ క్యాన్‌లో ఏదో ఉందనుకొని తల దూర్చింది. తలైతే దూరిందికానీ ఆ తలను వెనక్కి ఎలా తీయాలో అర్థం కాలేదు. దీంతో పాపం ఆ చిరుత నానా కష్టాలు పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 30 మంది కలిసి 48…
ఈమధ్యకాలంలో యువత వినూత్నంగా ఆలోచిస్తూ విజయాలు సాధిస్తున్నది. కొత్త కొత్త విషయాలను నేర్చుకొని వాటిని అమలు చేస్తూ సక్సెస్ బాట పడుతున్నది. దీనికి ఓ ఉదాహరణ పూణేలోని ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న టెర్రాసైన్ హోటల్. ఈ హోటల్‌కు వెళ్తె అక్కడ ఎవరూ మాట్లాడరు. అక్కడికి వచ్చే కస్టమర్లను ఏం కావాలి, ఏం తింటారు అనే విషయాలను సైగలద్వారా అడుగుతారు. వచ్చిన కస్టమర్లు సైగలతో చెప్పవచ్చు లేదా కావాల్సినవి మెనూలో చూపించవచ్చు. దీనికి కారణం లేకపోలేదు. ఇందులో పనిచేస్తున్న…
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. వచ్చీరావడంతోనే సంచలనం రేపింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రైడింగ్ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో స్కూటర్ డెలివరీలు ఇంకొంత కాలం ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ఆలస్యానికి చిప్‌ల కొరతే కారణమని తెలుస్తోంది. దేశీయంగా చిప్ ల తయారీ…
పరువు, మర్యాద, సమాజంలో గౌరవం ప్రతి ఒక్కరు కోరుకొనేది. బంధువులు, స్నేహితుల మధ్య పరువు పోతుందని ఎంతో మంది దారుణాలకు ఒడిగట్టిన ఘటనలు ఉన్నాయి. మనం ఎంతో ప్రేమించేవారు మనల్ని అందరిముందు అవమానిస్తే అంతకు మిచ్చిన మరణం ఉండదు. ఇదే అనుకున్నాడు ఒక భర్త.. భార్య తన స్నేహితుల ముందు, బంధువుల ముందు తనను అవమానించడంతో తట్టుకోలేని అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పూణెలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. పూణెకు చెందిన ప్రకాశ్…
బాలీవుడ్ స్టార్ షారూఖ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పూణేలో ప్రారంభమైంది. ఈ సినిమాలో షారూఖ్ సరసన దక్షిణాది తారలు నయనతార, ప్రియమణి నటిస్తున్నారు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ‘సంకి’ అనే పేరు పెట్టారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమాను 2022లో విడుదల చేయనున్నారు. మరో…
మహారాష్ట్రలోని పుణె జిల్లా నారాయణగావ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండానే ఓ బైక్ రోడ్డుపై 300 మీటర్లకు పైగా ప్రయాణించింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో బైక్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. డ్రైవర్ లేకుండా బైక్ దూసుకెళ్లడం ఏంటనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే… వేగంగా వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతను కింద పడిపోయాడు. కానీ, బైక్ మాత్రం 300 మీటర్లు ప్రయాణించి రోడ్డుపై పడిపోయింది. ఎవరికీ ప్రమాదం…
పూణేలో వింతఘటల చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండానే ఓ బైక్ దాదాపుగా 300 మీటర్లు ప్రయాణం చేసింది. వేగంగా వస్తున్న బైక్ రోడ్డుపై నడుస్తున్న పాదచారుడిని డీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కిందపడినప్పటికీ ఆ బైక్ మాత్రం ఆగలేదు. 300 మీటర్లమేర రోడ్డుపై ప్రయాణం చేసి ఎదురుగా వస్తున్న మినీ లారీకి తగిలి కిందపడింది. దీనికి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. …