పుణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. మహారాష్ట్రలోనే అతి పెద్ద బస్సు డిపోల్లో పుణెలోని స్వర్గేట్ బస్సు డిపో ఒకటి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. భారీ జనసందోహం తిరిగి ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో యువతి (26)పై రాందాస్ (36) అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు.
పూణె అత్యాచార నిందితుడు దత్తాత్రయ రాందాస్(36) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 75 గంటల పోలీసుల వేట తర్వాత దొరికిపోయాడు. నిందితుడి కోసం దాదాపు 13 పోలీస్ బృందాలు వేటాడాయి. పూణె సమీప ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వేటాడారు. డ్రోన్లు, డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు చేపట్టారు.