అనంతపురంలో సూపర్ సిక్స్ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతిలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్‌తో కలిసి పులివర్తి నాని మాట్లాడారు. ‘‘సూపర్ సిక్స్ సభ విజయవంతం కావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
లిక్కర్ స్కామ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌పై పెట్టుబడులు పెట్టారన్నారు.
చెవిరెడ్డి ఒక అపరిచితుడని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై జరిగిన దాడి, చెవిరెడ్డి కామెంట్స్ పై మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ్మెటతో కొట్టడం వల్ల నా తల, భుజం పై గాయాలు అయ్యాయన్నారు.
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో వర్శిటి జరిగిన దాడి ఘటనపై విచారణకు హాజరయ్యారు. అక్కడ ఆయన అధికారులతో మాట్లాడారు. "పద్మావతి వర్శిటిలో నాపై దాడికి కర్త, ఖర్మ, క్రియ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
ఏపీలో పోలింగ్ తర్వాత కూడా దాడు ఆగడం లేదు. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి జిల్లా స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది.