పులిచింతల ప్రాజెక్టులో జరుగుతున్న మరమ్మతు పనులను ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. ఏ లక్ష్యంతో అయితే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందో ఆ లక్ష్యం నెరవేరేలా వైయస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తుంది. ట్వీట్లు పెట్టే నాయకులు అధికారం లో ఉన్నప్పుడు పులిచింతల పనుల్లో నాణ్యత లో గుర్తించడంలో విఫలమయ్యారు అని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతం. 48 గంటల్లో 16వ గేట్ స్థానంలో స్టాప్ లాక్స్ నిర్మాణం…
పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఊడిపోయిన పదహారో గేట్ దగ్గర మరమ్మతు పనులు కొనసాగుతున్నాయ్. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి వచ్చిన నిపుణుల బృందం ప్రాజెక్ట్ వద్ద స్టాప్ లాక్ గేట్ అమర్చే పనిలో నిమగ్నమయ్యారు. స్టాప్ లాక్ ఏర్పాటులో భాగంగా ఒక ట్రయల్ వేయగా అది విజయవంతమైంది. దాదాపు 45 టీఎంసీల నీరు ఉండే ప్రాజెక్టును ఖాళీ చేశారు. డ్యామ్ నీటి మట్టం 6.5 టీఎంసీలకు తగ్గిపోయింది.పదహారో గేటు స్పియర్ బేస్‌తో సహా కొట్టుకుపోవడంతో…
పులిచింతల వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండింది. దీంతో నీరును గేట్టు ఎత్తి దిగువకు విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం చేసే సమయంలో ప్రాజెక్టులోని 16 వ నెంబర్ గేటు విరిగిపోయింది. దీంతో ఎమర్జెన్సీ గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు రాకపోకలను నిలిపివేశారు. పులిచింతల నుంచి ప్రస్తుతం…