2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒకరకంగా విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే క్రికెట్‌కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా కూడా చేరాడు. తన వన్డే కెరీర్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పుజారా, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం 103 మ్యాచ్‌లలో మొత్తం 7,195 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
Cheteshwar Pujara: టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన ప్రముఖ ఆటగాడు చతేశ్వర్ పుజారా తన 20 ఏళ్ల క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. తాజాగా ఆయన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. గత కొంతకాలంగా పుజారా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చివరిసారి 2023లో ఆస్ట్రేలియాతో లండన్‌లోని ది ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పుజారా ఆడాడు. ఆ తర్వాత నుంచి భారత జట్టులోకి ఆయనకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపించలేదు. నిజానికి ఆస్ట్రేలియా పర్యటనలో…