మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ యూపీఎస్సీకి సమర్పించిన దివ్యాంగ సర్టిఫికేట్ నకిలీదేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు. పూజా ఖేద్కర్ తన పేరును సర్టిఫికేట్‌లో మార్చుకుని మూడు వేర్వేరు పేర్లు ఉపయోగించి 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాసినట్లుగా పోలీసులు తెలిపారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం మరో యాక్షన్‌కు పూనుకుంది. బుల్డోజర్ చర్య చేపట్టింది. పూణెలోని ఆమె నివాసంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి చెట్లు, మొక్కలు పెంచారు.