మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోందని ఈగల్ టీం ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. హోటల్స్, రెస్టారెంట్స్, పబ్బు యజమానులు కలిసి డ్రగ్స్ వాడకం మొదలు పెట్టారని.. హోటల్ యజమానుష్టుల డ్రగ్స్ కేసులో సూర్య కీలక సూత్రధారిగా ఉన్నారన్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతోపాటు ఐదుగురిని అరెస్టు చేశామని తెలిపారు. మిగతా వాళ్ల కోసం ఇంకా గాలిస్తున్నామని స్పష్టం చేశారు.