చిన్న చిన్న అవసరాలకు బ్యాంకు నుంచి రుణం తీసుకునే బదులు స్నేహితులను సంప్రదించడం బెటర్. ఇలా మిత్రుడితో డబ్బులు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి అనేక రకాల పత్రాలు అవసరం. వ్యక్తిగత రుణాలపై భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీకు అత్యవసరం ఉన్నప్పటికీ కొన్ని సార్లు బ్యాంకుల్లో సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. దీంతో అధిక సమయం ఎదురు చూడాల్సి వస్తుంది.