చిన్న చిన్న అవసరాలకు బ్యాంకు నుంచి రుణం తీసుకునే బదులు స్నేహితులను సంప్రదించడం బెటర్. ఇలా మిత్రుడితో డబ్బులు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి అనేక రకాల పత్రాలు అవసరం. వ్యక్తిగత రుణాలపై భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీకు అత్యవసరం ఉన్నప్పటికీ కొన్ని సార్లు బ్యాంకుల్లో సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. దీంతో అధిక సమయం ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకే మిత్రులతో అప్పు చేస్తుంటాం. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 27 శాతం మంది స్నేహితులు మాత్రమే తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తారట. 73 శాతం మంది మింగేస్తారట.
READ MORE: Kannappa Trailer Review : కన్నప్ప ట్రైలర్ రివ్యూ.. యాక్షన్, డివోషన్..!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పబ్లిటీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సర్వేలో పాల్గొన్న 73 శాతం మంది స్నేహితులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదని చెప్పారు. కొన్నిసార్లు విషయం చాలా తీవ్రమవుతుందని.. ఆప్త మిత్రులే బద్ధ శత్రువులు అవుతారని చెప్పారు. సర్వే ప్రకారం.. డబ్బులు ఇచ్చిన మిత్రుడు తిరిగి ఇవ్వమని అడిగితే.. ఆ డబ్బును తిరిగి ఇచ్చి స్నేహానికి గుడ్‌బై చెబుతారనే సత్యం వెల్లడైంది. కొందరైతే.. డబ్బు అడగడానికి కూడా సిగ్గుపడే స్థాయికి వెళ్లతారట. ఈ అంశాన్ని చాలా మంది స్నేహితులు సీరియస్‌గా తీసుకోరు. అందుకే తిరిగి ఇవ్వరు. ఒకవేళ తిరిగి ఇచ్చినా.. ఇచ్చిన దాని కంటే తక్కువ ఇస్తారు. కొందరు స్నేహితులు చాకచక్యంగా ఉంటారు. తక్కువ మొత్తం తీసుకున్న తర్వాత దాని గురించి మరచిపోతారు. ఇచ్చిన డబ్బు అడిగితే.. తమకు ఉన్న బంధం ఎక్కడ చెడిపోతుందో అని కొందరు అడగడమే మానేస్తారట.
READ MORE: Himachal Pradesh: ముస్లిం అబ్బాయితో కలిసి పారిపోయిన హిందూ అమ్మాయి..చివరికీ..