Duddilla Sridhar Babu : రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, పోలీసు విభాగాన్ని మరింత సమర్థంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబర్ నేరాల అదుపు కోసం ఇప్పటికే పోలీసు…