పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన లాయర్లను జైలులోనే ఒంటరిగా కలిసేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జైలు హ్యాండ్‌బుక్ ప్రకారం.. ఇమ్రాన్‌ఖాన్‌ను ఒంటరిగా కలిసేందుకు న్యాయవాదులను అనుమతించాలని జైలు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది.
ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఇవాళ (మంగళవారం) జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద హింసకు సంబంధించిన ఎనిమిది ఆరోపణలపై PTI నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
తోషాఖానా కేసు విచారణకు సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైందని పాక్ మీడియా వెల్లడించింది.