టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పిఆర్వో బిఏ రాజు గుండెపోటుతో నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేశారు. ఆయన భార్య దర్శకత్వం వహించిన…