తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మీడియా ముసుగులో పదే పదే విష ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు వైసీపీని ప్రజలు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదన్నారు.