బీజేపీ మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లు మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పలు నగరాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత జరిగిన ఈ ప్రదర్శనలు కొన్ని చోట్ల హింసకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో…