దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ప్రొఫెసర్, పౌర హక్కుల నేత హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇస్లామిక్ దేశాల తరహాలో భారతదేశంలోనూ మత విలువల ఆధారంగా ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాబోతోందని హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రొ.హరగోపాల్‌తో పాటు తదితరులపై పెట్టిన దేశద్రోహం కేసును (ఉపా) వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలతో రాష్ట్ర దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆ పార్టీలు పేర్కొన్నాయి.