(ఆగస్టు 18న జయకృష్ణ జయంతి) చేయి తిరిగిన మేకప్ మేన్ గా పేరు సంపాదించిన జయకృష్ణ, నిర్మాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. జయకృష్ణ మేకప్ కారణంగా పలువురు హీరోలు, హీరోయిన్లు తెరపై అందంగా కనిపించి జనం మదిని దోచారు. అందువల్ల మేకప్ మేన్ అన్న పదం కాకుండా ‘రూపశిల్పి’ జయకృష్ణ అన్న పేరును సొంతం చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు అత్యంత సన్నిహితునిగా ఉండేవారు జయకృష్ణ. కృష్ణంరాజు హీరోగా తెరకెక్కి విజయం సాధించిన ‘కృష్ణవేణి, భక్త…