ప్రొద్దుటూరు సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం దద్దరిల్లింది. ప్రొద్దుటూరులో ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తుంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంతటి మహా సైన్యం మధ్య మన ప్రజా జైత్ర యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా తల ఎత్తుకుని రెపరెపలాడుతుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను మొదలుపెట్టారు. ఇప్పటివరకు మూడు నియోజకవర్గాలలో బస్సు యాత్ర ముగిసింది. తొలిరోజు వైఎస్సార్ జిల్లా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించింది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. రాజుపాలెం వద్ద నదిలో మునిగి అక్క తమ్ముడు గల్లంతయ్యారు. స్నానం కోసం కుందూ నదిలో దిగి మస్తాన్(27), ఇమాంబి(28) లు మృతి చెందారు. కుందు నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి అక్క తమ్ముడు మృతి చెందారు. మృతులు చాగలమర్రికి చెందినవారిగా గుర్తించారు.
ప్రొద్దుటూరు రాజకీయం హీటెక్కుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మె్ల్యేల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో రూ.40 కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్యే రాచమల్లు ఆక్రమించాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఎండోమెంట్ భూమిలో సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు ఎందుకు రోడ్డు వేశాడని దుయ్యబట్టారు.…
Off The Record: ఫ్యాక్షన్, రాజకీయ రగడతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నియోజకవర్గం కడపు జిల్లా ప్రొద్దుటూరు. నిత్యం ఇక్కడ గొడవలు, రగడలే. ఇప్పుడు మరో వివాదంతో వైసీపీ, టీడీపీ నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు…రాయలసీమలో ముఖ్య వ్యాపార పట్టణమే కాదు.. రాజకీయాలకు కూడా ప్రధానమైన ప్రాంతమే.. రాయలసీమ స్థాయి రాజకీయాలు గతంలో ఇక్కడి నుంచే నడిచాయి. ఇక్కడి నేతల వ్యవహార శైలి, రాజకీయ ఎత్తుగడలు అన్నీ వెరైటీగా కనిపిస్తాయి. సేవ చేసినా..…
YS Sunitha Reddy: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు చూపిస్తోంది.. విచారణ కీలక దశకు చేరుకుంది.. అయితే, ఈ సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి.. పొలిటికల్ ఎంట్రీపై ఓ పోస్టర్ కలకలం రేపుతోంది.. కడప జిల్లా ప్రొద్దుటూరులో తాజాగా వేసిన పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి.. వైఎస్ సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రికి రాత్రే పట్టణంలో వాల్ పోస్టర్ల అతికించారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ…
Maha Shivaratri 2023 Celebrations Live: మహా శివరాత్రి శుభవేళ ప్రసిద్ధ శైవక్షేత్రాలకు తాకిడి పెరిగింది.. శివనాస్మరణతో మార్మోగుతున్నాయి శైవక్షేత్రాలు.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలను లైవ్లో వీక్షించేందుకు కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=JjoHKzREyLc