సంక్రాంతి పండగ కోసం ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడుపుతుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన మరిన్ని బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని అన్నారు. మరోవైపు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు మంత్రి వార్నింగ్ ఇచ్చారు.