Ranji Trophy: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతడిని సెలక్టర్లు మాత్రం కరుణించడం లేదు. ఈ నేపథ్యంలో రంజీ ట్రోఫీలో పృథ్వీ షా కసితీరా ఆడుతున్నాడు. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీతో రాణించి తనకు టీమిండియాలో స్థానం కల్పించాలంటూ పరోక్షంగా సంకేతాలు పంపించాడు. ఈ మ్యాచ్‌లో ఒక దశలో పృథ్వీ షా 400 పరుగులు చేస్తాడని అభిమానులు భావించారు. కానీ 379 పరుగులు…