ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు నివశిస్తున్నారు. ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్తుంటారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని జైళ్లలో ఎంతమంది భారతీయులు ఉన్నారు అనే దానిపై భారత విదేశాంగ సహాయమంత్రి వీ మురళీధరన్ పార్లమెంట్‌లో వివరణ ఇచ్చారు. విదేశీ జైళ్లలో 7925 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. యూఏఈ జైళ్లలో 1663 మంది భారతీయులు ఖైదీలుగా ఉండగా, సౌదీ అరేబియాలో 1363…