ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాపై ఆందోళనకారుల నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. సోమవారం ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పరారయ్యారు. దీంతో నిరసనకారులు ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసమైన గణభాబన్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు.