తుఫాన్ ఇన్నింగ్స్ తో క్రికెట్ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వయసున్న వైభవ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. వైభవ్ సూర్యవంశీకి ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డును ప్రదానం చేశారు. దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన పర్ఫామెన్స్ తర్వాత వైభవ్‌కు ఈ గౌరవం లభించింది. ఈ వారం ప్రారంభంలో, విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై…