ప్రధాని మోడీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది.. అన్ని ఆస్పత్రులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఐఎంఏతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సమావేశం అయ్యారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నెతన్యాహు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
World Elephant Day 2024: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంరక్షణకు కృషి చేస్తున్న వారిని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.
ఢిల్లీలో ప్రధాని మోడీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు. అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఆదివారం వరుసగా రెండో రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 15 మంది డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఐదవ రోజు. నిన్న అంటే గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర రభస జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు వాకౌట్ కూడా చేశారు.
25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్యక్రమం కోసం ప్రధాని మోడీ కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని, 1999లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు.
25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్యక్రమం కోసం ప్రధాని మోడీ కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని, 1999లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం 7 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని.. పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు.