AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోధరల స్ధిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ చైర్మన్ గానూ, జిల్లా స్ధాయిలో కలెక్టర్ చైర్మన్ గానూ కమిటీలను ఏర్పాటు చేసినట్లు సర్కార్ వెల్లడించింది.
రాష్ట్ర మంత్రులు చైర్మన్లుగా మూడు కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగాల కల్పన, మాదక ద్రవ్యాలు అరికట్టడం, ధరల స్థిరీకరణ కోసం మూడు కేబినెట్ కమిటీల ఏర్పాటు చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా.. ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. నారా లోకేష్ చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది.