YS Jagan: ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్.. ఎన్టీవీ ఆఫీసులో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. జర్నలిస్టుల అరెస్టులు పత్రికా స్వేచ్ఛకే కాకుండా ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి అని ఖండించారు. పండుగ సమయంలో అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి పోలీసులు తలుపులు పగులగొట్టి ప్రవేశించి, చట్టపరమైన విధి విధానాలు పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం అత్యంత…
Kishan Reddy: తెలంగాణలో జర్నలిస్టుల అక్రమ అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమైన జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని తెలిపారు. ఓ న్యూస్ రిపోర్ట్ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 8 మంది సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (SIT) ఇంకా విచారణ జరుపుతూనే ఉందని.. ఇంతలోపే రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి,…
ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మాత్రమే కారణంగా జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెర్చ్ వారెంట్ లేకుండా చానెల్ కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించి సోదాలు నిర్వహించడం పూర్తిగా అన్యాయమని అన్నారు. పండుగ సమయంలో అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు…