రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఉమ్మడిగా అభ్యర్థిని పోటీలో పెట్టాలని ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఇందులో భాగంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, అభ్యర్థుల విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అంతే కాదు.. విపక్షాలు అభ్యర్థిగా ఎవరు అనుకున్నా.. నా వల్ల కాదు బాబోయ్ అన్నట్టుగా.. అంతా తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా…
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని…
ఇవాళ రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుండటం, అలాగే ఢిల్లీలో విపక్ష పార్టీలు సమావేశం అవనుండటంతో… హస్తినలో జరిగే రాజకీయ పరిణామాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి నెలకొంది. జులై 24వ తేదీన రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీలోపు కొత్త రాష్ట్రపతి ఎన్నుకోవాల్సి ఉంది. ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి… నేడు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల 18న ఎన్నికలు, 21న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎలక్టరోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక…