జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఔట్‌రీచ్ సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. శుక్రవారం నాడు ప్రపంచంలోని ప్రముఖ నేతలతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సాయంత్రం వరకు ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. మూడోసారి ప్రధాని అయినందుకు మోడీని కలిసిన ప్రతి దేశాధినేత అభినందనలు తెలిపారు. ఇటలీలోని అపులియా నగరంలో జరిగిన ఈ సమావేశం ప్రపంచ శక్తులతో…
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో వందల మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. యుద్ధం మొదలై రెండు వారాలు దాటిపోయింది. ఉక్రెయిన్ లో అపార ప్రాణ, అస్తి నష్టం జరుగుతోంది. ఇళ్లు, అపార్ట్‌మెంట్స్, హాస్పిటల్స్ ఇలా మౌలిక వసతులన్ని దెబ్బతిన్నాయి. సిటీలన్నీ శిథిలాలతో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లోనూ రష్యా సైన్యం దాడులు చేస్తుండటంతో ప్రాన నష్టం భారీగానే జరుగుతోంది. చనిపోయిన సాధారణ పౌరుల సంఖ్య వెయ్యి దాటిందని అంచనా…