భారత 14వ రాష్ట్రపతిగా సేవలు అందించిన రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. దీంతో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం ఘనంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ఇతర కేంద్రమంత్రులు, రాజ్యసభ,లోక్ సభ ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదవీ నుంచి దిగిపోతున్న క్రమంలో ఆయన దేశాన్ని ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు.