గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తోన్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ టీజర్‌ను గురువారం (ఏప్రిల్ 27)న సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించారు. సంగీత్ శోభన్, శాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, అనసూయ, వెన్నెల…