నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీని వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ముఖ్యంగా ఈ మూవీకి పవన్ సీహెచ్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సారంగదరియా పాట అయితే యూట్యూబ్‌లో రికార్డులను కొల్లగొట్టింది.…