PM Sheikh Hasina India Visit: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాలోొ పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు షేక్ హసీనా. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధాని మోదీ, షేక్ హసీనాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వచ్చే 25 ఏళ్లలో భారత్-బంగ్లా సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకుంటాయని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ అని మోదీ…